కాబూల్‌లో ఉగ్రదాడి.. 16మంది మృతి

కాబూల్‌: అఫ్ఘానిస్థాన్‌లో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో 16మంది మరణించారు. కాబూల్‌లోని గ్రీన్‌ విలేజ్‌ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక అధికారుల కథనం మేరకు యుఎస్‌ ప్రత్యేక ప్రతినిధి జల్మ§్‌ు ఖలీల్జాద్‌ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదన ఒప్పందంపై చర్చించేందుకు కాబూల్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తాలిబన్‌ ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వాహనంలో భారీ పేలుడు పదార్థాలను ఉంచి దీన్ని గ్రీన్‌ విలేజ్‌ పక్కన నిలబెట్టి, పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మరణించగా, 119 మంది గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/