కాంగ్రెస్‌ నుండి పోటీ చేస్తా

Sumalatha
Sumalatha

బెంగాళూరు: అంబరీష్‌ భార్య సుమలత రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటిపై సుమలత క్లారిటి ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నుండే తన రాజకీయ జీవితానిక శ్రీకారం పడుతుందని, కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటి చేస్తానని సుమలత స్పష్టం చేశారు. అంబరీష్‌ సొంత జిల్లా అయిన మండ్య నుంచి పోటీ చేస్తానని అంబరీష్‌ ఆశయం కూడా కాంగ్రెస్‌లో ఉండడమేనని స్పష్టం చేయడంతో జేడీఎస్‌కు షాక్‌ ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉండగా ఆదివారం మండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠంలో నిర్మలానందనాథ స్వామిజీని సుమలత, కుమారుడు అభిషేక్‌తో కలసి ఆశీర్వాదం పొందారు. రాజకీయ ప్రస్తావన లేదని ఆమె తేల్చి చెప్పారు.