కాంగ్రెస్‌ కర్షకులను విస్మరించింది: పిఎం మోడీ

Narendra Mody
Narendra Mody

కర్షకులు సుఖంగా నిద్రపోతుంటే కాంగ్రెస్‌కు,మిత్రపక్షాలకు నిద్రపట్టడం లేదని మోడీ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో ముక్త్వాలో జరిగిన కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీని ఉద్ధేశించి మోడీ ప్రసంగిస్తూ ఎంఎన్‌పి పెంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కర్షకులు తమకెంతో ఉపశమనం లభించిందని భావిస్తున్నారని అన్నారు.ఎంఎన్‌పి పెంపుతో రైతులు ఆవేదన చల్లారిందని ఆయన అన్నాఉ. గత ఏడు దశాబ్దాలుగా రైతులు విశ్వసించిన పార్టీలు రైతుల కష్టాలను బేఖాతరు చేశారని ఆయన విమర్శించారు. ఆ పార్టీలు కేవలం హామీలను మాత్రమే గుప్పించాయని, ఆచరణలో మాత్రం శూన్యం ఆయన అన్నారు. అధికారంలో కొనసాగిన పార్టీ ఒక కుటుంబం కోసమే పని చేసిందని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఆయన ఎద్దేవా చేశారు.