కాంగ్రెస్‌లో చేరిన బిజెపి సీనియర్‌ నేత

HARISH MEENA,MP
HARISH MEENA,MP

జైపూర్‌: రాజస్థాన్‌లో ఎన్నికలకు ఇంకా నెల రోజులే గడువు ఉంది. ఇంతలోనే బిజెపికి షాక్‌ తగిలింది. ఎన్నికలకు ముందే సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. పార్టీ సీనియర్‌ నేత, ఎంపి హరీశ్‌ మీనా బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. హరీశ్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌, మాజీ సియం అశోక్‌ గెహ్లాట్‌ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కమలానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.