కర్ణాటకలో ఉప ఎన్నికల పోలింగ్‌

BY POLL IN KARNATAKA
BY POLL IN KARNATAKA

బెంగళూరు: కర్ణాటకలో మూడు లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన కారణంగా బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్‌సభ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. ఈ బై ఎలక్షన్‌లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. మరోవైపు బిజెపి కూడా సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి పోటీనే ఇస్తుంది. అలాగే రామనగర స్థానాన్ని కుమారస్వామి వదులుకోవడంతో ,జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మరణించడంతో ఈ స్థానాల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్‌-జేడియూ ఒకరికొకరు సహకారం అందించుకోవడంతో అభ్యర్ధులకు మద్దతిస్తున్నారు. నవంబరు 6న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.