కరవు రహిత రాష్ట్రమే ధ్యేయం

BABUF

కరవు రహిత రాష్ట్రమే ధ్యేయం
విజయవాడ: రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా చేయటమే లక్ష్యమని సిఎం చంద్రబాబునాయడు అన్నారు. సోమవారం సాయంత్రం కేబినేట్‌ సమావేశంలో కరువు, మంచి నీటి ఎద్దడి అంశాలపై ఆయన చర్చించారు. మంచినీటికి రూ.300 కోట్లు నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో మునిసిపాలటీలకు మరో రూ.40 కోట్లు విడుదల చేశామని తెలిపారు. కూలీల దినసరి కూలీ 50శాతం అదనంగా రూ.194కు పెంచినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాశ్వత కరవు నివారణ కోసం నీరు-చెట్టు కార్యక్రమానికి ప్రాధాన్య ఇచ్చామన్నారు.