కమల్‌ పార్టీ ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’

KAMAL HASSAN
KAMAL HASSAN

కమల్‌ పార్టీ ‘మక్కళ్‌ నీది మయ్యమ్‌’

చెన్నై :తమిళనాడులో సరికొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించేశారు. చెప్పి నట్టుగానే రాజకీయ అరంగేట్రం చేశారు. ‘మక్కల్‌ నీది మయ్యమ్‌ (జస్టిస్‌ ఫర్‌ పీపుల్‌) పేరుతో రాజకీయపార్టీని ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. తమి ళనాడులోని మదురైలో ఒత్తకడై మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన తనపార్టీ పేరు, జెండాను వేలాదిమంది అభిమానుల మధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు.