కప్పు కాఫీతో కడివెడు లాభం

Drinking Cofee
Drinking Cofee

కప్పు కాఫీతో కడివెడు లాభం

రోజుకు 4 సార్లు పుచ్చుకుంటే చాలు కేన్సర్లు దరి చేరవు

వార్త సైన్స్‌డెస్క్‌ : వయసు పెరుగు తున్న కొద్దీ కాఫీ,టీ లాంటివి తగ్గించేయా లని డాక్టర్లు సలహా ఇస్తుం టారు. చాలామంది కూడా తమకు తాముగానే కాఫీ, టీలను మానేయటానికి కుస్తీ పడుతుంటారు. ఇక ఆ బాధలు పడక్కరలేదు. కాఫీ ప్రియులకు చక్కటి శుభవార్త. రోజుకి ఓ నాల్గు కప్పుల కాఫీ గనక సేవిస్తే ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో ఖచ్ఛితంగా చెప్పలేకపోయినా..

తొందరగా మరణించే అవకాశాలను తగ్గిస్తుందట. ఇటీవల ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌,ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయాల సంయుక్త పరిశోధనా బృందం, విశ్వవ్యాప్యంగా పరిశోధించి మరీ ఈనిర్ణయానికి వచ్చారట. కాఫీని రోజుకు 4నుంచి 7 సార్లు సేవించే వారిలో రీనల్‌డిజార్డర్స్‌ అంటే కిడ్నీ, లివర్‌.. ఇలా మన శరీరంలో ప్యూరిఫైయింగ్‌ వ్యవస్థలు, రకరకాల కేన్సర్‌ వ్యాధుల బారిన పడకుండా కాఫీలోని కెఫిన్‌లాంటి పదార్థాలు అడ్డుకుంటు న్నాయట.

మరీ ముఖ్యంగా గొంతు, గర్భసంచి, స్కిన్‌ కేస్సర్‌ల వల్ల కలిగే మరణాలఅవకాశాలను 10నుంచి 17శాతం వరకూ తగ్గిస్తోందట. అంతే కాదు డయాబిటీస్‌, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, అల్జీమర్‌, డిప్రెషన్‌ వంటి వాటికి కొద్దిగా విరుగుడులా కూడా పనిచేస్తోందట. అయితే సిగరెట్లు, ఆల్కహాల్‌ మాత్రం కాఫీలామేలుచేసే సూచనలులేనే లేవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పటికే పాము విషాన్ని హోమియోపతి మందులలో వాడుతూ చాలా రకాల కేన్సర్లకు చికిత్సచేస్తున్నారు. విషంతో పోటీపడే కెఫిన్‌, నికోటిన్‌ లాంటికి కూడా చికిత్సలకు ఉపయోగతాయని తేలింది. అంటే ఒక్కోసారి కాలకూట విషంకూడా మంచి చేస్తుందన్నమాట!!