ఓటర్‌ లిస్ట్‌లో పేరు ఉంటే ఓటు వేసుకోవచ్చు

VOTE
VOTE

ఓటర్‌ స్లిప్‌ లేకపోయినా ఏదో ఒక గుర్తింపు కార్డు చాలు
హైదరాబాద్‌: ప్రజాస్వామ్యం దేవాలయం వంటిది, ఎవరో చెప్పారని కాకుండా ఎవరో బలవంతం పెట్టారనో,తాయిలాలు ఇచ్చారనే కాకుండా, అంతరాత్మ ప్రబోధంతో గుడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చినంత పవిత్రంగా ప్రతి ఒక్క పౌరుడూ పోలింగ్‌ కేంద్రానికి బాధ్యతతో వెళ్లి వేసి రావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ రజత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.అన్ని జిల్లాల్లో ఏపిక్‌ కార్డులు,ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీ చేశామని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నా రు. ఎపిక్‌ కార్డు లేకపోతే ఓటర్‌ స్లిప్‌ ఓటేసేందుకు గుర్తింపు కార్డులు ఉంటే సరిపోతుందన్నారు. ఓటింగ్‌ కోసం 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామన్నారు. ఓటరు లిస్ట్‌లో పేరు ఉంటే తమ వద్ద ఉన్న కార్డు చూపించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. ఏఏ కార్డులు చెల్లుతాయి-పాస్‌ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు, ఆరోగ్య భీమా కార్డు, పాన్‌ కార్డు, ప్రభుత్వ రంగ సంస్థ, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఐడీ కార్డు చూపించి ఓటు వేసుకోవచ్చు., బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆర్‌జీఐ జారీ చేసిన ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డు, ఫోటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంట్‌, ఎంపీ,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు చెల్లుతాయి. డిసెంబర్‌ 26 నుంచి పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేస్తామని, ఈసారి ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను సిద్దం చేస్తామన్నారు.