“ఓఆర్‌ఓపి” vs “ఓడోమాస్‌”

Omar Abdullah
Omar Abdullah

శ్రీనగర్‌: ఓన్లీ రాహుల్‌ ఓన్లీ ప్రియాంక(ఓఆర్‌ఓపి) అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహలుగాంధీ, జనరల్‌ సెక్రటరీ ప్రియాంకని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, జమ్మూకాశ్మీర్‌ మాజీ సియం ఒమర్‌ అబ్ధుల్లా స్పందించారు. దేశం ఓడిఓఎంఓఎస్‌ (ఓడోమాస్‌)తో బాధపడుతుందని ఎద్దేవా చేశారు. మోడోమాస్‌ అంటే ఓవర్‌ డోస్‌ ఆఫ్‌ ఓన్లీ మోది ఓన్లీ షా ( మోది ,షా డోస్‌ ఎక్కువగా ఉంది) అని అబ్దుల్లా ట్వీట్‌ చేశారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఒన్‌ ర్యాంక్‌ ఒన్‌ పెన్షన్‌(ఓఆర్‌ఓపి) హామీని అమలు చేసింది. కాంగ్రెస్‌ మాత్రం దేశానికి ఓన్లీ రాహుల్‌ ఓన్లీ ప్రియాంక(ఓఆర్‌ఓపి)ని ఇచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం దేశానికి ఓన్లీ రాహుల్‌ ఓన్లీ ప్రియాంక (ఓఆర్‌ఓపి)ని ఇచ్చింది అని కాంగ్రెస్‌పై అమిత్‌ షా విమర్శలు చేశారు.