ఒక్కరోజే 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు

Kumbh Mela ,vasantha panchami
Kumbh Mela ,vasantha panchami

అలహాబాద్‌: జనవరి 15న మకర సంక్రాంతి రోజు కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం వసంత పంపచమి పర్వదినం సందర్భంగా పవినత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు అలహాబాద్‌కు పోటెత్తారు. గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున నుంచే భక్తులు స్నాన ఘట్టాలకు బారులు తీరారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఈ ఒక్క రోజే సుమారు 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యోదయానికి ముందే 50 లక్షల మంది భక్తులు గంగలో మునకేసినట్లు చెప్పారు.ప్రస్తుత కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్‌ను వసంత పంచమి సందర్భంగా చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్నానాలు చేసేందుకు, తిరిగి వెళ్లేందుకు వేర్వేరు దారులను ఏర్పాటు చేసి ఎక్కడా తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంది. అత్యధికులు అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత స్నానాలకు ఉపక్రమించారు.