ఒకవైపు నిరసన… మరోవైపు జీతాల పెంపు

Palaniswamy
Palaniswamy

చెన్నై: ఒకవైపు తమిళనాడుకు చెందిన రైతులు గత కొన్ని రోజులుగా రుణమాఫీ కోసం జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు చేపడుతుంటే మరోవైపు దీన్ని పట్టించుకోని తమిళనాడు ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలను రెట్టింపు చేసింది. ఎమ్మెల్యేల జీతాలను 100 శాతంపంచుతున్నట్లు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు నెలకు రూ.యాభై వేలు అందుతుంది. తాజా ఉత్తర్వులతో వారి జీతం రూ. లక్ష కానుంది. దీంతో పాటు ఎమ్మెల్యేల పింఛన్‌ను కూడా రూ. 12వేల నుంచి 20 వేలకు పెంచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ల్యాడ్స్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుతమ డిమాండ్ల నెరవేర్చేదాకా నిరసనలు ఆపబోమని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల జీతాలను పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.