ఐ.రా.స అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా స‌త్య త్రిపాఠి

Satya tripati
Satya tripati

ఐక్యరాజ్యసమితి(ఐరాస) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త సత్య ఎస్ త్రిపాఠి నియమితులయ్యారు. న్యూయార్క్‌లో ఉన్న ఐరాస పర్యావరణ కార్యక్రమం కార్యాలయానికి అధిపతిగానూ వ్యవహరించనున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా 35 ఏండ్ల అనుభవం ఉన్న త్రిపాఠి 1998 నుంచి ఐరాసలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ తరఫున ఆయన యూరప్, ఆసియా, ఆఫ్రికాలో పనిచేశారు. సుస్థిరమైన అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడటమే కాకుండా న్యాయపరమైన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ, అడవులు అంతరించిపోకుండా కాపాడటంలోనూ త్రిపాఠి ముఖ్యపాత్ర పోషించారు. ఇంతకుముందు ఆయన ఐరాస కార్యాలయం డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ అధిపతిగానూ పనిచేశారు. త్రిపాఠి కామర్స్‌లో, న్యాయవిద్యలో మాస్టర్ డిగ్రీ చదివారు.