ఐరాసలో ట్రంప్‌ హెచ్చరికలు

Trump
Trump in UNO

న్యూయార్క్‌: వరుస అణు పరీక్షలు నిర్వహిస్తూ మానవాళికి పెనుప్రమాదంగా దాపురించిన ఉత్తరకొరియా కవ్వింపు చర్యలను మానుకోకపోతే ఆ దేశాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి సిధ్దంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. మంగళవారం నాడు న్యూయార్క్‌లోని సర్వ ప్రతినిధి సభనుద్దేశించి తొలిసారిగా మాట్లాడారు. ఉత్తరకొరియా చేపడుతున్న చర్యలను ఎండగట్టాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. కిమ్‌ తన పాలనను తానే అంతమొందించుకోబోతున్నాడని ,భవిష్యత్‌లో ఇదే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదకరమైన  క్షిపణులను రూపొందిస్తూ అస్థిరపరచే కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని చూస్తూ వదిలేయలేమన్నారు.