ఐపిఎల్ లో ఈ క్రికెటర్ ప‌రిస్థితి దారుణం

tymal mills
tymal mills

ముంబైః ఐపీఎల్ వేలంలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కోట్లకు కోట్లు చెల్లించి సీనియర్ ఆటగాళ్లను దక్కించుకున్న ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇప్పుడు సీనియర్ ప్లేయర్లంటే ఆమడ దూరం జరుగుతున్నాయి. క్రిస్ గేల్, మిల్స్ వంటి ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇంగ్లండ్ క్రికెటర్ మిల్స్ పరిస్థితి మరింత ఘోరం. గత సీజన్‌లో రూ.12.5కోట్లకు మిల్స్‌ను బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మాత్రం ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఒక్క సంవత్సరంలో ఇంత మార్పుకు కారణం మిల్స్ ఆటతీరే. మిల్స్ గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు.