ఏ పార్టీతో పొత్తు లేదుః అమిత్‌షా

AMITH SHAW
AMITH SHAW

మైసూరుః కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ జత కట్టేది లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. మైసూరులో రెండవ సారి టూర్ చేస్తున్న అమిత్ షా .. కర్నాటకలో తమ పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తున్నందని ధీమా వ్యక్తం చేశారు. లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా ఇవ్వాలన్న అంశంపై ఎన్నికల తర్వాత స్పష్టమైన వివరణ ఇస్తామని షా తెలిపారు. ఓటర్లను ఆకర్షించేందుకే సీఎం సిద్ధారామయ్య ఆ ఎత్తుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య కర్నాటకలో ప్రస్తుతం హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. ఇవాళ తన స్వంత జిల్లా అయిన మైసూరులో సీఎం సిద్ధారామయ్య పర్యటన ప్రారంభించారు. ఉదయమే ఆయన స్థానిక హోటల్‌లో టిఫిన్ చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.