ఏప్రిల్‌ 15 నుంచి జలరక్షణ ఉద్యమం

AP CM
AP CM

ఏప్రిల్‌ 15 నుంచి జలరక్షణ ఉద్యమం

అమరావతి: వేసవిలో ఎక్కడా నీటికొరత ఉండకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. సిఎస్‌తో కలిసి ఇవాళ ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు , సర్పంచ్‌లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన ఈనెల 15 నుంచి రెండు నెలలపాటు అంటే జూన్‌ 15 వరకు జలరక్షణ ఉద్యమం చేపట్టాలని ఆదేశించారు.