ఏపీ డిమాండ్లన్నిటీకి కేంద్ర ప్రభుత్వం అంగీకారo

TDP mp's
TDP mp’s

కేంద్ర ప్రభుత్వం ఏపీ డిమాండ్లన్నిటీనీ అంగీకరించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీల ఆందోళన ఫలించాయి. రాష్ట్ర రెవెన్యూ లోటును వెంటనే భర్తీ చేసేందుకు కేంద్రం  అంగీకరించింది. 14వ ఆర్థిక సంఘం నింధనల ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను పది నెలల కాలానికి ఏపీకి రావలసిన మొత్తాన్ని తక్షణమే ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే తదుపరి మూడేళ్ల కాలానికి సంబంధించిన మొత్తాన్ని కూడా ఒకే సారి త్వరలో అందజేసేందుకు అంగీకరించింది. ప్రత్యేక హోదా వల్ల వచ్చే నిధులను కూడా ఒకే సారి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. విశాఖ రైల్వే జోన్ కు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రేపో ఎల్లుండో ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.