ఏపీకి కేంద్ర సర్కార్‌ షాక్‌!

ap logo
ap logo

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం పెద్ద షాక్‌ ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న
అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. 2014-15 రెవెన్యూ లోటు రూ.16వేల కోట్లని ఏపీ ప్రభుత్వం
గతంలోనే చెప్పింది. అయితే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోమని , రెవెన్యూ లోటు రూ. 4,117.89 కోట్లేనని
కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఇప్పటికే రూ. 2,303 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఏపీ కొత్త
ప్రాజెక్టులకు చేసిన మొత్తాన్ని లోటుగా పరిగణించలేమని అలాగే రుణమాఫీ, పెన్షన్లు, విద్యుత్‌ బకాయిల వంటివి
కూడా చెల్లించబోమని కేంద్రం తేల్చిచెప్పింది.