ఏపిలో ‘ఒకే రాష్ట్రం-ఒకే సిరీస’

Vehicles
Vehicles

అమరాతి: ఏపిలో ఈరోజు నుండి ‘ఒక రాష్ట్రం-ఒక సీరీస్‌’ పేరిట రవాణా శాఖ వినూత్న విధానాన్ని ప్రారంభించింది. నేటి నుండి రిజిస్ట్రేషన్ చేసే కొత్త వాహనాలకు తిశి 39 సిరీస్‌తో వాహనాల నెంబర్లు కేటాయించనున్నారు. అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈరోజు నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. విజయవాడలో ఈ నూతన విధానాన్ని రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ వాహనాలకు జిల్లాకో కోడ్‌ చొప్పున కేటాయించేవారు. ఇకపై ప్రతి జిల్లాలో ప్రతి కొత్త వాహనానికి తిశి 39 సిరీస్‌తో నెంబర్లు కేటాయించనున్నారు. ఆర్టీసీ వాహనాలకు తిశి 39Z, పోలీస్‌ వాహనాలకు తిశి 39శి, రవాణా వాహనాలకు తిశి 39గి, సహా గీ,జు, జూ, శ్రీ, Y సిరీస్‌ కేటాయించారు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఖఒకే రాష్ట్రం ఒకే సిరీస్గ విధానానికి శ్రీకారం చుట్టామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో రవాణా శాఖ అంటే ప్రజల్లో అవినీతి శాఖ అనే అభిప్రాయం ఉండేదని, సాంకేతికతతో అవినీతిని పూర్తి స్థాయిలో నివారించామన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో కెల్లా ఉత్తమ విభాగంగా నిలిపామన్నారు.