ఏపికి, తెలంగాణకు నీటి పంపకాలు

ap,telangana
ap,telangana

అమరావతి : కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏపీ, తెలంగాణలకు నీటి పంపకాలు చేసింది. ఏపికి  76.087, తెలంగాణకు 26.954 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణాజలాల పంపిణీ 66:34 ప్రకారం.. ఏపీకి 390.656, తెలంగాణకు 201.247 టీఎంసీల వాటా ఉందని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. ఈ నెల 16న జరిగిన కేఆర్‌ఎంబీ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలూ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు.. ఏపీలోని నీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 2.50 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 13 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ కుడి కాలువ ద్వారా 44 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 10.132 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా 6.455 టీఎంసీలు.. మొత్తం 76.087 టీఎంసీలను కేఆర్‌ఎంబీ కేటాయించింది.