ఏదో ఒక దశలో ఆ బంధంలోకి అడుగుపెడతా

PRIYANKA CHOPRA
PRIYANKA CHOPRA

ప్రియాంకా….ఆ తర్వాత క్వాంటికో సిరీస్ తో  పాపులర్ అయింది. ఆ తర్వాత రెండు మూడు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ….అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు ఏకంగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం….పెళ్లి వరకు వెళ్లిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనో నిక్ ను ఇండియాలోని తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది ప్రియాంక.

ఈ నేపథ్యంలో తాజాగా వివాహ వ్యవస్థ గురించి ప్రియాంక చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకముందని – తన జీవితంలో ఏదో ఒక దశలో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని చెప్పింది.  తాను చాలా రొమాంటిక్ అని….తనను ప్రేమించే వ్యక్తి కోసం బంధాన్ని ఏర్పరుచుకోవడం ఇష్టమని ప్రియాంక తెలిపింది. పెళ్లి చేసుకోవడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.

ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం పెళ్లితో ముడిపడుతుందని ప్రియాంక చెప్పింది. వివాహ బంధంతో ఇద్దరు ప్రేమికులు ఒక్కటవడం అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. జీవితంలో ఏదో ఒక దశలో తప్పక ఆ బంధంలోకి అడుగుపెడతానని చెప్పింది.

అయితే వివాహం చేసుకోగానే ఆడవారు బలవంతులుగానో…బలహీనులుగానో…చిన్నగానో…పెద్దగానో….లేకుంటే ఫెమినిస్ట్ గానో మరొకరిగానే మారరని స్పష్టం చేసింది.