ఏడాది త‌ర్వాత జ‌రిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాందిః జ‌గ‌న్‌

ys jagan
ys jagan

నంద్యాలః నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ఐదో రోజు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌
మాట్లాడుతూ, ,‘ఈ మూడున్నరేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును తీసుకుని చంద్రబాబు మీ దగ్గరకు వస్తారని తమ పార్టీకి
ఓటు వేయమని చెబుతూ ఓటర్లకు రూ.5 వేలు ఇచ్చి, దేవుడు పటం చూపి వారితో ప్రమాణం చేయించుకుంటారు. ఏ దేవుడూ
కూడా పాపానికి ఓటేయమని చెప్పడు. అలా చెప్పేది దెయ్యాలే. రూ.5 వేలు మీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా

ఓటేయండి..ధర్మానికే ఓటెయ్యండి..న్యాయాన్ని గెలిపించండి. . చంద్రబాబులాగా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ధి, పోలీసులు
లేరు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపే ఛానెళ్లు, పేపర్లు నా దగ్గర లేవు’. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రిని
కాకపోవచ్చు కానీ ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది అని ఆయ‌న తెలిపారు.