ఎవ్వరికీ ఇబ్బందిలేనివిధంగా 10% రిజర్వేషన్‌

modi
modi

మదురైలో ప్రధానిమోడీ
మధురై: అగ్రవర్ణపేదలకు 10శాతం రిజర్వేషన్‌ కోటావల్లప్రస్తుతం రిజర్వేషన్‌ పొందుతున్న ఎస్‌సిఎస్టీబిసి వర్గాల రిజర్వేషన్లకు ఎలాంటి అంతరాయం ఉండదని ప్రధానినరేంద్రమోడీ పేర్కొన్నారు. పదిశాతం కోటాను ఎవరు వ్యతిరేకించినా వారంతా అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకంగానే భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మదురైలో పర్యటించిన సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఎన్‌డిఎప్రభుత్వం హెల్త్‌కేర్‌రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, అందుబాటులో ప్రతి ఒక్కరికీ అదునాతన వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలభారత వైద్యవిజ్ఞానసంస్థ నిర్మాణానికి మోడీ మదురై సమీపంలోని తొప్పూరులో శంకుస్థాపనచేసారు. అనంతరం బిజెపి ఆధ్వర్యంలో జరిగిన వాజ్‌పేయి గ్రౌండ్స్‌లోను, మండేలా నగర్‌, ఇన్నర్‌రింగ్‌రోడ్లలోకూడా బిజెపి సమావేశాలు ఏర్పాటుచేసింది.రిజర్వేషన్లపైమోడీ మాట్లాడుతూ అగ్రవర్ణపేదల రిజర్వేషన్లకారణంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు లేనివిధానంలోనే రిజర్వేషన్లు తెచ్చామన్నారు.కన్యాకుమారినుంచి కాశ్మీర్‌, గౌహతి నుంచి గుజరాత్‌వరకూ తమ ప్రభుత్వం హెల్త్‌కేర్‌కు అత్యధికప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. మదురైలో నిర్మించే ఎయిమ్స్‌కు రూ.1200 కోట్లు ఖర్చవుతుందని, తమిళనాడు ప్రజలకు ఎంతోమేలు కలుగుతుందని అన్నారు. మదురైలో సూపర్‌స్పెషాలిటీ ఆసుప్రతులు ప్రారంభించడంపట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. మదురై, తంజావూరు, తిరునల్వేలిల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులను ఆయనప్రారంభించారు. అగ్రవర్ణ పేదలకు ఎలాంటిప్రయోజనాలు అందడంలేదని గుర్తించామని, సమాజంలో అట్టడుగు వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లో కూడా నిరుపేదలు అత్యధికంగా ఉన్నారని, వారికి విద్యా,ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో రాజ్యాంగసవరణ చేసి తెచ్చామనిఅన్నారు. తమిళనాడులో ఎయిమ్స్‌ స్థాపించాలని ఆనాటి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వమ్‌ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు ఎయిమ్స్‌ ఎంతో అధునాతన వైద్యం పొందేందుకు వీలు కల్పిస్తుందని ధీమా వ్యక్తంచేసారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడంపట్ల ప్రధానిమోడీకి పన్నీర్‌సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రిపర్యటన సందర్భంగా ఎండిఎంకె ప్రధానకార్యదర్శి వైకో మదురైపెరియార్‌ బస్స్టాండ్‌ జంక్షన్‌ వద్ద నిరసనప్రదర్శననిర్వహించారు. ప్రధాని మదురై వీడివెళ్లేంతవరకూ నిరసన కొనసాగిస్తామన్నారు. గాలిలోనికి నల్లటి బెలూన్లను వదిలి, నల్లబ్యాడ్జీలను ధరించి వైకో నిరసన ్పకటించారు. ఎయిమ్స్‌కు శంకుస్థాపన ఒక రాజకీయ స్టంట్‌ అని విమర్శించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకోసమే ఇదంతా హంగామా అని పేర్కొన్నారు. తమిళులను వంచించిన ప్రధాని నరేంద్రమోడీపైనే తమ నిరసన అని పోలీసులు తమకు వ్యతిరేకం కాదని, పోలీసులు కూడా తమిళజాతీయులేనని గుర్తుంచుకోవాలని సూచించారు. పిఎంకె, డిఎండికె, పుతియతమిజగమ్‌ పార్టీలు ఎఐఎడిఎంకె బిజెపి సంకీర్ణంలో చేర్చేందుకు వీలుగా ప్రధాన పర్యటన ఏర్పడిందని కొన్ని వర్గాలుచెపుతున్నాయి. అయితే ఈ పొత్తులుపరంగా ఎలాంటి ఖరారుకాలేదు. తమిళనాడులో పాగావేయాలని బిజెపి దృష్టిసారించింది. ఇద్దరు ప్రముఖ నేతలు కరుణానిధి, జయలలిత మృతిచెందిన తర్వాత రాజకీయాలు మారిపోయాయి. గత ఎన్నికల్లో బిజెపి స్వల్పస్థాయిలోమాత్రమే పనితీరుచూపించింది. 20 ఏళ్లనాటి పనితీరే చూపించింది. ప్రధాని రాకసందర్భంగా విస్తృతస్థాయి బందోబస్తు జరిగింది. మండేలా నగర్‌నుంచి మొత్తంప్రధాని పర్యటన పొడవునా ఎస్‌పిజిగ్రూప ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. ఐదువేల మంది సిబ్బందిని నియమించారు.