ఎవరిని వదలోద్దు….. కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌

Ponguleti sudhakar
Ponguleti sudhakar

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాల కేసు చర్చనీయాంశమైంది. ఈ కేసుతో సంబంధం ఉన్న
ఎంతటివారినైనా శిక్షించాలని, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎక్సైజ్‌ శాఖ అధికారులను కోరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు పొంగులేటి
సుధాకర్‌రెడ్డి,ఆకుల లలిత, పి.సంతోష్‌కుమార్‌, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి డ్రగ్స్‌ నిర్మూలనపై ఎక్సైజ్‌ శాఖ కమీషనర్‌
చంద్రవదన్‌ను కలిశారు. డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించోద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు తగిన చర్యలు
తీసుకోవాలని విన్నవించారు.ఎక్సైజ్‌ శాఖ తీసుకున్న చర్యలను తాము అభినందిస్తున్నల్లు చెప్పారు. ఈ కేసును నిర్వీర్యం
చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని, అందువలన కమీషనర్‌ను కలిసినట్లు చెప్పారు. ఎవరికి ప్రమేయం ఉన్నా చర్యలు
తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ సంపూర్ణ మద్ధతుని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.