ఎయిరిండియా మాజీ చీఫ్‌పై సిబిఐ కేసు

aravind jadhav
aravind jadhav

ఎయిరిండియా మాజీ చీఫ్‌ అరవింద్‌ జాధవ్‌పై సిబిఐ అవినీతి కేసు దాఖలు చేసింది. జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల నియామకం విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ ఆరొపించింది. జాదవ్‌తో పాటుగా వైద్యసేవల మాజీ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎల్పీ నఖ్వా, అదనపు జనరల్‌ మేనేజర్లు ఏ కథ్పాలియా, అమితాబ్‌సింగ్‌, రోహిత్‌ భాసిన్‌లపై కూడా సిబిఐ కేసు దాఖలు చేసింది. 2009-10 మధ్యకాలంలో సిఎండి జాధవ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రమోషన్ల విషయంలో అక్రమ ప్యానెల్‌ను తయారు చేశారని సిబిఐ తెలిపింది. ఆ ప్యానెల్‌ కథ్పాలియా సింగ్‌,బాసిన్‌తో పాటుగా ఐదుగురి పేర్లను సిఫారసు చేసింది. కథ్పాలియాపై క్రిమినల్‌ కేసు ఉన్నప్పటికీ విజిలెన్స్‌ క్లియరెన్స్‌ ఇప్పించారని పేర్కొన్నది. నఖ్వాకు కూడా జాదవ్‌ దొడ్డిదారిన ప్రమోషన్‌ ఇప్పించారని తెలిపింది.