ఎన్‌టిపిసి బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన రాహుల్‌

 

rahul and sonia
rahul and sonia

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో ఎన్‌టిపిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బుధవారం ఇక్కడి ఎన్టీపీసీ పవర్ ప్లాంటులో పేలుడు సంభవించడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పెద్ద శబ్దంతో యాష్ పైప్‌లైన్ పేలిపోవడంతో వాయువులు, ఆవిరి ఎగసి 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సోనియా.. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని యూపీ కాంగ్రెస్ కమిటీ, పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయాన్నే రాహుల్ రాయ్‌బరేలికి వచ్చారు. బాధిత కుటుంబాలను కలుసుకుని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి.. వారికి అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.