ఎన్నికల చిహ్నంపై ఈసీకి వెళ్లిన కమల్‌

Kamal Hassan
Kamal Hassan

న్యూఢిల్లీ: విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ అధినేత కమల్‌హాసన్‌ నేడు ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. డిప్యూటీ ఎన్నికల కమీషనర్‌ చంద్రభూషణ్‌ను కలిసి తన పార్టీ నమోదు అంశంపై చర్చించారు. తదనంతరం కమల్‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం మా పార్టీకి సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. ఈసీ అధికారులు అడిగిన అన్ని వివరాలను అందించాం. మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ చిహ్నాం ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని ఈసీ అధికారులు తెలిపారు. పార్టీ చిహ్నాంలో ఈసీ ఎలాంటి ప్రశ్నలు వేయనట్లు తెలుస్తోంది. కమల్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి తాజాగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు.