ఊచకోత కేసులో ఒకరికి ఉరిశిక్ష, ఇంకొకరికి జీవితఖైదు

aisc
aisc

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో తొలిసారి ఓ దోషికి ఉరిశిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. ఇద్దరు నేరస్తులలో ఒకరికి ఉరిశిక్ష ఖరారు చేయగా, మరొకరికి జీవితఖైదు విధించింది. ఇద్దరు సిక్కు వ్యక్తులను చంపిన కేసులో వీళ్లిద్దరూ దోషులుగా తేలారు. ఈ కేసు విచారణ చేసిన సిట్‌ ఇద్దరికి ఉరిశిక్ష వేయాలని కోరింది.వాళ్ల చర్య ఓ సామాజికి వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన మారణహోమంలో భాగమని, ఇది అత్యంత అరుదైన కేసని సిట్‌ వాదించింది. నిజానికి 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును క్లోజ్‌ చేశారు. నిందితులు తమ చేతుల్లో కర్రలు, కిరోసిన్‌ పట్టుకుని వెళ్లడం చూస్తే ఇది ఖచ్చితంగా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యగా భావించాలని సిట్‌ తరఫున వాదించిన న్యాయవాది స్పష్టం చేశారు. ఈ హత్యలు ప్రణాళిక ప్రకారం జరిగినవి కావని, సడెన్‌గా జరిగిన అల్లర్లలో అలా జరిగిపోయిందని నిందితుల తరఫు న్యాయవాది ఓపి శర్మ కోర్టుకు తెలిపారు.