ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన శాంసంగ్‌ సంస్థ

samsung
samsung

సియోల్‌: ఎలక్ట్రానిక్‌ి తయారీ దిగ్గజం శాంసంగ్‌ సంస్థ తమ ఉద్యోగలకు ఈరోజు క్షమాపణలు చెప్పింది. తమ సంస్థలో సెమీ కండక్టర్‌, తెరల తయారీ ఫ్యాక్టరీలో పని చేసి క్యాన్సర్‌, ఇతర జబ్బులకు గురైనా దాదాపు 240 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు సంస్థ సహా అధ్యక్షుడు కిమ్‌ కి-నా§్‌ు క్షమాపణలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. వారికి జరిగిన నష్టానికి ఈ క్షమాపణలు సరిపోవనీ అన్నారు. మొత్తం బాధితుల్లో 80 మంది చావు బతుకుల్లో ఉన్నారు. సెమీ కండక్టర్‌, ఎల్‌సీడీ తెరల తయారీ కర్మాగారాల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలను ఉద్యోగుల దరి చేరనీయకుండా కాపాడడంలో తాము విఫలమైనట్లు పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో చేసిన ఓ ప్రకటన మేరకు బాధితులకు ఒక్కొక్కరికీ 1.33 వేల డాలర్ల వరకూ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది.