ఉత్త‌ర‌కొరియాపై ప‌ట్టు బిగిస్తున్న చైనా

north korea and china
north korea and china

బీజింగ్‌: క్షిపణి ప్రయోగాలు, అణుపరీక్షలతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పుతున్న ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతామండలిలో తీర్మానం ఆమోదించింది. ఈ నేపథ్యంలో చైనా కూడా ఆ దేశంపై సరికొత్త ఆంక్షలు విధించింది. ఉత్తరకొరియాకు చమురు సరఫరాలో కోత విధించాలని నిర్ణయించింది. దీంతో శుద్ధిచేసిన పెట్రోలియం ఎగుమతులను ఏడాదికి 2 మిలియన్‌ బ్యారెల్స్‌కు పరిమితం చేసినట్లు చైనా పేర్కొంది. మరోపక్క ఉత్తరకొరియాకు లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ అమ్మకాలను నిలిపివేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నట్లు చైనా వాణిజ్యమంత్రి వెల్లడించారు. అంతేగాక.. ఉత్తరకొరియా నుంచి వస్త్ర దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.