ఉగ్రవాదులను హతమార్చిన పాక్‌ భద్రతా దళాలు

pak soldiiers
pak soldiiers (File)

ఉగ్రవాదులను హతమార్చిన పాక్‌ భద్రతా దళాలు

ముల్తార్‌ (పాకిస్థాన్‌): పాక్‌లోని పంజాబ్‌లో 8 మంది ఉగ్రవాదులను పాక్‌ భద్రతా దళాలు హతమార్చాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌లోని సెంట్రల్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో వెళ్లిన భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది ఉగ్రవాదులు మరణించిన ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా డెరా ఘాజీ ఖాన్‌ పట్టణంలో ఈ సంఘటన జరిగినట్టు పంజాబ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం పేర్కొంది.