ఈ బాధలు ఇంకెన్నాళ్లు?

TRAFFIC JAM
TRAFFIC JAM

ఈ బాధలు ఇంకెన్నాళ్లు?

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాల ని, ఒకపక్క తెలంగాణ పాలకులు శక్తి వంచన లేకుండా కృషిచేస్తుంటే.. మరొక పక్క కొందరు అధికారుల దళారుల అవినీతి,నిర్లక్ష్యం, ఆశ్రితపక్షపాతంతో భాగ్యనగర ప్రతిష్ట దెబ్బతింటుందేమో ననిపిస్తున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవ్ఞతున్నది.ఆదివారం రాత్రి నగరంలో కురిసిన వర్షాలతో రహదారులు అనేకచోట్ల చెరువ్ఞలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్‌ గురించి చెప్పక్కర్లేదు. వర్షపు నీరు రోడ్లపైకి రావడంతో వాహనాలు ఆగిపోవడం,గంట లకొద్దీ ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. ప్రధానంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు పడిన,పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు .

ఇప్పుడే కాదు ఏ చిన్నపాటి వర్షం కురి సిన భాగ్యనగరవాసులకు బాధలు తప్పడం లేదు.ఇంకొక పక్క ముఖ్యమంత్రితోసహా పురపాలకశాఖ మంత్రి, ఉన్న తాధికారులు సమావేశాలమీద సమావేశాలు నిర్వహిస్తు న్నారు. సీనియర్‌ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకోవాల్సిందని పదేపదే చెప్తున్నారు. నగర మేయర్‌, కమిషనర్‌తో సహా అధికారు లు పర్యటనలు చేస్తున్నారు. రోడ్లు ఒకపక్కమర మ్మతు చేస్తుంటే.. మరొకపక్క తవ్వే కార్యక్రమం యధేచ్ఛగా జరుగుతుంది.

కొన్నిచోట్ల నిల్వ ఉండే నీటిని బయటకు పంపేందుకు స్థానికులు కొందరు ఎక్కడికక్కడ కాలువలు తీస్తున్నారు. వివిధశాఖల మధ్య సమన్వయం లేక పోవ డంతో కోట్లాది రూపాయలు వెచ్చించి వేసిన రోడ్లుగుంత లమయం అయిపోతున్నాయి. పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ఈ గుంటలను తప్పిస్తూ వాహనాలను నడపడం చోదకులకు కష్టతరమవ్ఞతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ గుంతలు ఎంత లోతున్నాయో? నీరుఏమే రకు ఉన్నదో ఊహించలేక వాహనాలు నడపడంతో రోడ్ల మీదనే ఆగిపోయి మోరాయిస్తున్నాయి.

ఇదిట్రాఫిక్‌కుపెద్ద సమస్యగా మారుతోంది. ఈ రహదార్ల బాధలు కొంతవర కైనా తప్పించేందుకు హైదరాబాద్‌ రోడ్డు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.కోట్లాది రూపాయలు కేటాయించారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు కన్పించడం లేదు. దక్షిణ భారత దేశంలోనే గుర్తింపు పొందిన హైదరాబాద్‌ నగరానికి ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ప్రకృతి చేస్తు న్న బీభత్సం సరే,ఈ బీభత్సాన్ని ఎదుర్కొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపైన లేదా? ప్రకృతికంటే తోటి మానవ్ఞడు చేస్తున్న పనుల వల్లనే కష్టాలు పెరుగుతున్నాయనే వాదనను కొట్టిపారేయ లేం. వాస్తవంగా చూస్తే గత రెండుమూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌ మంచినీరు, మురుగునీరు వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. స్థానిక సంస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన ఈ కార్పొరేషన్‌కు ఎందుకు ఈ పరిస్థితి దాపురిస్తున్నది.

ఒకపక్క రోడ్లు వెడల్పు పేరుతో కూలగొడుతున్నారు. మరొకపక్క నడి రోడ్డుపై ఇళ్లునిర్మిం చినా పట్టించుకోరు.గత రెండుమూడు నెలలుగా ప్రధాన రహదారుల్లో ఆక్రమణల పేరుతో వాణిజ్యసముదాయాలు, భవనాలకు ముందున్న మెట్లను కూలగొడుతున్నారు. ఆ కార్యక్రమం నిరాటంకంగా చేస్తున్నారు. కొన్నిచోట్లపోలీసు భద్రతతో కూడా ఈకూలగొట్టే కార్యక్రమంజరుగుతున్నది. అవి నిర్మాణం చేస్తున్నప్పుడు ఏంచేశారు? రోడ్ల ఆక్రమ ణకు గురికాకుండా పరిరక్షించాల్సిన అధికారగణం అప్పు డు కళ్లు మూసుకున్నదా? లేక మామూళ్లతో సరిపెట్టుకు న్నదా? అనే ప్రశ్నలకుజవాబులు దొరకవ్ఞ.ఇక నిబంధనల కు విరుద్ధంగా ఇష్టానుసారంగా కార్పొరేషన్‌ నుంచి పొంది న ప్లాన్లలో మార్పులుచేసి ఇళ్లు నిర్మించుకోవడం పరిపాటి గా మారిపోయింది. ఏకంగా చెరువ్ఞలను ఆక్రమించుకుని ఫ్లాట్లుచేసి అమ్ముకున్నారు.

చివరకుకాలవలను కూడా వది లిపెట్టడం లేదు. ఈ కాల్వల ఆక్రమణల వల్లనే ఈ పరి స్థితి దాపురిస్తున్నదనేది వాస్తవం. డ్రైనేజీ పైపుల సైజు పెంచకుండా ఇష్టానుసారంగా వందలసంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చారు. దీంతో మురికి నీరు ఆ పైపుల్లో పట్టకరోడ్లపైకి ప్రవహిస్తున్నది. అంతేకా దు వర్షాలు విస్తారంగా కురిసినప్పుడు ఆ నీరు వెళ్లేందు కు ప్రత్యేక లైన్లు కూడా వేశారు.కానీ ఆలైన్లలో కూడా మురికినీటికి అనుమతిస్తున్నారు. దీంతో వర్షపు నీరు, మురికినీరు కలిసి రోడ్లపైకి వచ్చి చెరువ్ఞలనుతలపిస్తూ పొంగిపొర్లుతున్నాయి.

ఈపరిణామాలు దోమలకు స్థావరాలై డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, ఫ్లూవంటి రోగాలతోపాటు క్యాన్సర్‌,గుండెజబ్బులను శక్తివంచన లేకుండా పెంచుతున్నాయి.వీటి నిర్మూలనకు వాడేమందు లను మరిచిపోయారు. నగర పౌరుల సమస్యలను తీర్చేం దుకు ఏటా వందలాది కోట్లు ఖర్చుపెడుతున్నారు. అవి ఏమవ్ఞతున్నాయో? ఏమేరకు అమలు అవ్ఞతున్నాయో? సామాన్యులకు అర్థంకాదు. కానీకొందరు మంత్రులు,ప్రత్యే కంగా ముఖ్యమంత్రి వచ్చిపోయేరహదారులు మాత్రం గతంలోకంటే అత్యంత పరిశుభ్రంగా ఉంచుతున్నారు.అక్ర మ నిర్మాణాలు, ప్రధానంగా మురికి కాల్వలనుఆక్రమించు కుని కట్టిన భవనాలను తొలగించేందుకు చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కొన్ని నిర్మాణాలనుకూలగొట్టారు.

రాజకీయ జోక్యమో, లేక మరే కారణాలేమోకానీ మధ్య లోనే ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నారు. నాలాలపై ఉన్న భవనాలను తొలగించే కార్యక్రమం మళ్లీ ఆగిపో యింది. హుస్సేన్‌సాగర్‌ నుండి ఆరంభమై మూసీలో కలి సేవరకూ అలాగే మూసీకి వచ్చేనాలాలు ఎక్కడెక్కడ ఆక్ర మణలకు గురయ్యాయో అధికారులకు తెలియందికాదు. గల్లీల పరిస్థితి చెప్పక్కర్లేదు.అన్నీ ఇన్నీ ఆక్రమణలుకాదు. ఈ మురుగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా నాలా లపై ఉన్న ఆక్రమణలను తొలగించకుండా ఉన్నంతకాలం ఈ సమస్య అంతకంతకూ పెరుగుతుందేతప్ప తగ్గదు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌,హైదరాబాద్‌