ఈ నెల 17న కమల్‌నాథ్‌ ప్రమాణం స్వీకారం

kamal nath
kamal nath

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ సియంగా కమల్‌నాథ్‌ ఈ నెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భోపాల్‌లోని లాల్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయన ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. తీవ్ర ఉత్కంఠకు తెర పడినట్లు అయింది. గత రాత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. జ్యోతిరాదిత్య సింధియా కూడా సియం పదవిని ఆశించినప్పటికీ కమల్‌నాథ్‌నే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ ఎంపిక చేశారు. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో 114 సీట్లను కైవసం చేసుకున్నది. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది.