ఈ ఏడాది నుంచే కాలేజీల్లో ఈబిసి కోటా

prakash javadekar
prakash javadekar

న్యూఢిల్లీ: ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఇటీవల పార్లమెంటులో బిల్లు పాసైన విషయం తెలిసిందే. ఐతే ఆ కోటాను ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 2019-20 సంవత్సరం నుంచి విద్యాలయాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ణు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలు మాత్రమే ఈబిసి కోటా కింద సీట్లు పొందవచ్చు. స్కూళ్లు, కాలేజీలు ఈ కోటాను అమలు చేస్తాయని మంత్రి తెలిపారు. ఈబిసితో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబిసి కోటాను కూడా అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా మొత్తం 40 వేల కాలేజీలు, 900 వర్సిటీల్లో ఈబిసి కోటా అమలు చేస్తారన్నారు. ఈబిసి కోటా అమలు కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను కూడా పెంచనున్నట్లు ఆయన తెలిపారు.