ఇరు నేత‌ల కీల‌క స‌మావేశం స‌మ‌యం ఖ‌రారు

Trump & Kim jong un
Trump & Kim jong un

వాషింగ్ట‌న్ః ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీకి ముహూర్తం ఖరారైంది. సింగపూర్‌ కాలమానం ప్రకారం ఈ నెల 12న ఉదయం 9 గంటలకు ఇరువురు నేతలు సమావేశం కానున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్‌, కిమ్‌ భేటీ కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి శారా సాండర్స్‌ తెలిపారు.