‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’లో జాబ్‌ ఎలా ఉంది సర్‌?

upasana
upasana

హైదరాబాద్‌: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరిందట. తన ఉద్యోగం ఎలా ఉందని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంటు కేటిఆర్‌ను ట్విట్టర్‌ ద్వారా అడుగుతున్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్‌కు వెళ్లారు. ”ఇన్వెస్ట్‌ తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి వారిని పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ డెస్క్‌కు కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.