ఇదీ మన నేవీ సత్తా

NAVY
NAVY

ఇదీ మన నేవీ సత్తా

అబ్బురపరిచిన నౌకా విన్యాసాలు
శత్రుదేశాలకు సత్తాచాటిన భారత్‌ నావికాదళం
పెద్దసంఖ్యలో తరలివచ్చిన జనం

విశాఖపట్నం: నేవీ విన్యాసాలు విశాఖ ప్రజలను ఆకట్టుకు న్నాయి. యుద్ధాన్ని తలపించేవిధంగా విన్యాసాలు జరగడంతో ప్రజలు మంత్ర ముగ్ధులయ్యారు. నేవీ విన్యాసాల కోసం విశాఖ నగరంలోని సాగరతీరం (ఆర్‌కెబీచ్‌) ముస్తాబు అయ్యింది. నేవీ సత్తాను చాటి చెప్పే విధంగా విన్యాసాలను కనీవిని ఎరుగుని రీతిలో నిర్వహించింది. హెలికా ప్టర్లు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు చేసిన ప్రదర్శనలు, పోరాటాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. భారత నావికాదళం 1971 డిసెంబర్‌ నాలుగున కరాచీ హార్బర్‌ వద్ద పాకిస్థాన్‌ జరిపిన దాడిని తిప్పికొడుతూ భారత విజయపతాకాన్ని ఎగురవేసింది. దీనికి ప్రతీకగా ప్రతీ ఏడాది డిసెంబర్‌ నాలుగున భారత నావికాదళం ఈ విన్యాసాలను చేసి శత్రు దేశాలకు హెచ్చరికలు చేస్తూనే వ్ఞన్నారు. ఈ విన్యాసాలు విశాఖ ప్రజలకు కనువిందు చేశాయి. సాయి సద్యవేళ చీకట్లు కమ్ముతుండగా నేవీ యుద్ద నౌకలు ఒక్కసారిగా సముద్ర తీరానికి చేరుకున్నాయి. నౌకలకు ఏర్పాటు చేసిన విద్యుతీపాలంకరణ విశాఖ ప్రజ లకు కనువిందు చేశాయి.