ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచితే లాభం

Modi
Modi

న్యూఢిల్లీ: ఇథనాల్‌ ఉత్పత్తిని రాబోయే రోజుల్లో 450 కోట్ల లీటర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోది తెలిపారు. వరల్డ్‌ బయోఫ్యూయల్‌ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ఈ ఉత్పత్తి పెంపు ద్వారా 12 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు దృష్టి పెట్టనప్పటికి వాజపేయి హయాంలో ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రారంభమైందని, ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని మోది తెలిపారు. 10 వేల కోట్ల ఖర్చుతో 12 జీవ ఇంధన రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2022 వరకు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను బ్లెండ్‌ చేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తామన్నారు. బయో రిఫైనరీల వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయన్నారు.