ఇటు పొత్తులు-అటు సీట్ల వాటాలు!

                           ఇటు పొత్తులు-అటు సీట్ల వాటాలు!

RAHUL, MAYAVATI, AKHILESH
RAHUL, MAYAVATI, AKHILESH

సార్వత్రిక ఎన్నికలకోసం బిఎస్‌పి,ఎస్‌పి,కాంగ్రెస్‌వ్యూహం
లక్నో: దేశవ్యాప్తంగా బిజెపికి అడ్డుకట్టవేసేందుకు మహాకూటమితో ప్రతిపక్షాలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీతోపాటు తృణమూల్‌కాంగ్రెస్‌, సమాజ్‌వాది,ఆర్‌జెడి వంటి పార్టీలు సమిష్టిగా కృషిచేస్తుంటేమరికొన్ని పార్టీలు ఇప్పటికే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి టికెట్ల వాటాలనుసైతం ఖరారుచేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌సమాజ్‌పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈదిశగానే ముందుకువెళుతున్నాయి. సమాజ్‌వాదిపార్టీ, బహుజన్‌షమాజ్‌పార్టీలు 30 సీట్లచొప్పున పోటీచేస్తాయి.కాంగ్రెస్‌ పార్టీ తనఅభ్యర్ధులను కేవలం పది స్థానాల్లో మాత్రమే పోటీచేస్తుందని వెల్లడి అయింది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభస్థానాలున్నాయి. సీట్ల ఖరారుతర్వాత మిగిలిన పదిస్థానాలు చిన్నపార్టీలకు పంపిణీచేయాలని చూస్తున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్‌ వంటి పార్టీలకు సీట్లను కేటాయించేందుకు ఈమూడు పెద్దపార్టీలు నిర్ణయించాయి. ఆర్‌ఎల్‌డి అభ్యర్ధి తమస్సుమ్‌ హసన్‌ ఇటీవలే బిఎస్‌పి, ఎస్‌పి,కాంగ్రెస్‌ మద్దతుతో బిజెపి అభ్యర్ధి మృగాంకసింగ్‌ను కైరానా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడించారు. అదేవిధంగా ఈ ప్రతిపక్షాలు గతంలో బిజెపనిని గోరఖ్‌పూర్‌, ఫుల్పూరు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో సైతం ఓడించాయి. ప్రతిపక్షా పార్టీల్లో ఒక్కొక్కపార్టీకి అభిప్రాయబేధాలున్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదిపార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ ఇందుకు సార్ధ్యం వహించారు. మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్‌పితో ఒత్తు కొనసాగుతుందని స్పష్టంచేసారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ పొత్తులు ఇదేవిధంగా కొనసాగితే బిజెపిని మట్టికరిపించగలమని అఖిలేష్‌ భావిస్తున్నారు. మా కూటమి బిఎస్‌పితో కొనసాగుతుందని, 2019 ఆర్వత్రిక ఎన్నికలవరకూ కలిసే ఉంటామని, కొన్ని సీట్లు ఆపార్టీకి ఇవ్వాలని ఖచ్చితంగా ఇస్తామని అన్నారు. బిజెపిఓడించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. బిజెపని చీఫ్‌ అమిత్‌షా కూడా చిరకాల ప్రత్యర్ధులు ఇద్దరు కలిసి రావడాన్ని స్వాగతించారు. బిఎస్‌పి,ఎస్‌పి పార్టీలు కలిసి రావడం 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమపార్టీకి సవాలేనని పేర్కొన్నారు. అయితే తమపార్టీ అమేథి లేదా రా§్‌ుబరేలిలో సైతం కాంగ్రెస్‌ను ఓడిస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులు ఒకరిపై ఒకరు పోటీచేయడం సహజసాంప్రదాయంగా వస్తోంది దేశంలోని అనేకరాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది. బిజెపి హవాను అడ్డుకునేందుకే ఈ సమిష్టి వ్యూహం అమలుచేస్తున్నాయి. 2014లోక్‌సభ ఎన్నికలు, ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోసైతం ఇదే జరిగింది. బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేకపోయింది.కాంగ్రెస్‌ జెడిఎస్‌ టైఅప్‌తో కర్ణాటకలో కొత్తసంకీర్ణప్రభుత్వం ఏర్పాటయింది.