ఇక మందుబాబులకు తప్పదు భారీ మూల్యం

manohar parikar
Manohar parikar

పానాజి: తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులు గోవాకు వెళ్లి ఎంజా§్‌ు చేయడం షరా మాములే. ఇకపై గోవాకు వెళ్లేవారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే భారీ జరిమానా గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్‌ తెలిపారు. రూ.2500 ఫైన్‌ విధిస్తామని చెప్పారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతుందని తెలిపారు. ఆగస్టులోపే ఈ విధానాన్ని అమలు చేయాలనుకున్నామని, ఆగస్టు 15నుంచి అమలులోకి తెస్తామని చెప్పారు. ఇటీవల అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్‌ ప్రాంతంలో కళశాల విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారని పారికర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మద్యం బాటిల్స్‌ పట్టుకుని వెళ్తుండటాన్ని తాను చూశానని, ఖాళీ సీసాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల యాత్రికులకు ప్రమాదకరమని చెప్పారు.