ఇక తెలంగాణలో విమాన ఇంజన్లు

TS Minister Ktr-1
TS Minister Ktr-1

ఇక తెలంగాణలో విమాన ఇంజన్లు

హైదరాబాద్‌: తెలంగాణ పారిశ్రామిక ప్రగ తికి మరో కీలక ప్రాజెక్టు నగరానికి వచ్చింది. ఇప్పటికే ఎరోస్పేస్‌ రం గంలో తనదైన ముద్రవేసుకున్న నగరం మరోక అంతర్జాతీయ పెట్టు బడి పెట్టేందుకు సంస్థ ముందుకు వచ్చింది. జీఈ, టాటాల మద్య కుదిరిన ఒప్పంద ప్రకారం టాటా అడ్వాన్స్‌ సిస్టమ్స్‌ కలిసి విమాన ఇంజన్‌, ఇతర విమాన కాంపోనెట్లను తయారీ చేయనున్నారు. తెలంగాణ ఏయిరో స్పేస్‌ రంగానికి ఈ ఒప్పందం మరింత ఊతం ఇస్తుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు.

బుధవారం జరిగిన సమావేశంలో జీఈ సంస్థ చైర్మన్‌, జాన్‌ ప్లానరీకి తెలంగాణ ప్రభుత్వ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం జీఈ కంపెనీతో తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాల్సింది కోరుతూ వస్తుంది. గత యేడాది అమెరికాలోని సంస్థ చైర్మన్‌తో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశం అయ్యారు. విమాన ఇంజన్‌ తయారీతో పాటు కాంపొనెంట్‌లతో పాటు రానున్న రోజుల్లో హైదరాబాద్‌ నుంచే మిలటరీ విమానాల ఇంజన్లు, ఎయిర్‌ క్రాఫ్టు వ్యవస్థలకు సంబంధించిన ఇతర పరికరాల తయారీ అవకాశాలను సైతం పరిశీలించనున్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటలో తెలిపారు.

ఈ వ్యూహాత్మక ఒప్పందంతో జీఈ ఏవియేషన్‌, హైదరాబాద్‌లో ఉన్న టాటా అడ్వాన్స్‌ సిస్టం లిమిటెడ్‌(టాసిల్‌) కలిసి ఎయిర్‌ క్రాఫ్ట్‌ కాంపోనెంట్స్‌ తయారీ, అసెంబ్లీంగ్‌ టెస్టింగ్‌ వంటి రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. దీంతో పాటు కొత్తగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేసి ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజన్‌ తయారీకి అవసరం అయిన ఈకోసిస్టంను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి తయారు చేయ నున్న ఈ ఇంజన్‌ ప్రపంచంలోనే ప్రముఖమైన ఏయిర్‌ క్రాఫ్ట్‌ ఇంజన్‌గా పేరు పొందింది.

ఈ రంగంలో రానున్న ఇతర భాగస్వామ్యలకు కూడా ఈ ఇంజన్‌ తయారీ అంశం కీలకంగా ఉండడంతో పాటు హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. టాటా సంస్థకు భారత దేశ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగంలో అగ్రగామిగా ఉందని, లీఫ్‌ ఇంజన్లకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో తమ సంస్థ టాటాతో చేసుకున్న భాగస్వామ్యం ద్వారా ఆ డిమాండ్‌ను అందుకోగలమని జీఈ సంస్థ చైర్మన్‌ జాన్‌ ఏల్‌ ప్లానరీ అన్నారు. టాటా సంస్థతో చేసుకున్న భాగస్వామ్య మేకిన్‌ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా రానున్న రోజుల్లో మరిన్ని నూతన సాంకేతిక అభివృద్ధి చేసే దిశగా కొనసాగుతుందన్నారు. జీఈతో భాగస్వామ్యం ద్వారా మరింత భారతదేశంలో ఏరో స్పేస్‌ డిఫెన్స్‌ రంగ నిపుణ సామర్థ్యాలను పెంచుతుందని టాటా చైర్మన్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.