ఇక‌పై ఒక్క మ్యాచ్ ఓడినా వెన‌క్కే…

Rishab panth
Rishab panth

న్యూఢిల్లీః ఐపిఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఈ మూడు జ‌ట్లు ఐపిఎల్ ప‌ట్టిక బోర్డులో చివ‌రి స్థానంలో ఉన్నాయి. టోర్నీలో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ బుధవారం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా దిల్లీ ఆటగాడు రిషబ్‌ పంత్‌ మాట్లాడుతూ…‘ఈ మ్యాచ్‌ విజయం మాకెంతో అవసరం. ప్రత్యర్థి జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్నా. మ్యాచ్‌ ఆరంభం నుంచి ఎలా అయినా గెలుస్తాం అన్న పాజిటివ్‌ ఆలోచనతోనే ఉన్నాం. టోర్నీలో ఇక ఒక మ్యాచ్‌ ఓడినా మేము ప్లేఆఫ్స్‌ రేసులో ఉండబోమని తెలుసు. ఇదే వ్యూహంతో ప్రతి మ్యాచ్‌ ఆడతాం’ అని తెలిపాడు.