ఇండోనేషియాలో సునామి, 62 మంది మృతి

tsunami hits indonesia
tsunami hits indonesia

క్యారిటాః ఇండోనేసియా సునామీలో మృతుల సంఖ్య 62కి చేరింది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. శనివారం రాత్రి 9.30 సమయంలో అకస్మాత్తుగా సునామీ సంభవించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అలల ధాటికి తీర ప్రాంతంలోని భవనాలన్నీ దెబ్బతిన్నాయి.  సునామీలో దాదాపు 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోందని, వారి ఆచూకీ కోసం సహాయక బృందాలను మోహరించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి పుర్వో నుర్గోహో వెల్లడించారు.
పర్యాటకులు అధికంగా ఉన్న బీచ్‌పై ఉన్నట్టుండి భారీ అల ఎగసిపడి.. వినాశనం సృష్టించిందని ప్రత్యక్ష సాక్షి మహమ్మద్‌ బిన్‌టాంగ్‌ వెల్లడించారు. ‘‘సెలవు రోజును ఆస్వాదించేందుకు మేం బీచ్‌కు వచ్చాం. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నీళ్లు వచ్చి మాపై పడ్డాయి. అప్పటికప్పుడే విద్యుత్‌ సరఫరా నిలిచి అంతా చీకటిగా మారిపోయింది.’’ అని 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడు చెప్పాడు.క్రాకటోవ్‌ అగ్ని పర్వతం పేలడం వల్లే సునామీ వచ్చి ఉంటుందని నుర్గోహో వెల్లడించారు.  సునామీకి గల కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఇండోనేషియా భూగోళ పరిశోధన విభాగం ప్రయత్నాలు చేస్తోంది.