ఇంటర్‌బోర్డుకు రెండు స్కోచ్‌ అవార్డులు

inter board secretary Ashok
inter board secretary Ashok

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డుకు వచ్చిన రెండు స్కోచ్‌ అవార్డులను బోర్డు కార్యదర్శి డాక్టర్‌ ఎ. అశోక్‌ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈకార్యక్రమంలో స్కోచ్‌ సంస్థ సిఈఓ, గురుఛరణ్‌, చీఫ్‌ కమిషనర్‌ బన్సాల్‌ల చేతుల మీదుగా ఈఅవార్డులను ఆయన అందుకున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ విద్యా వ్యవస్థలో టెక్నాలజీ ఉపయోగించుకుని విద్యార్థులకు, కళాశాలలకు పరీక్షల నిర్వహణ, పరిపాలనలో అత్యుత్తమంగా సేవలను అందజేస్తున్నందుకు ఈఅవార్డులను స్కోచ్‌ సంస్థ అందజేసింది. మొదటి అవార్డు బోర్డు విద్యార్థులకు..కాలేజీలకు ఆన్‌లైన్‌ సర్వీసులు అందిస్తున్నందుకు..రెండోది పరీక్షల విధానంలో అమలు చేస్తున్న సంస్కరణలకు వచ్చాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.