ఆ డైలాగులు చూడగానే భయమేసింది

KAJOL IN VIP-2 TRAILOR LAUNCH-2

KAJOL IN VIP-2 TRAILOR LAUNCH-2

ఆ డైలాగులు చూడగానే  భయమేసింది

తాజాగా ముంబాయిలో విఐపి2 ట్రైలర్‌ లాంచ్‌ ఘనంగా జరిగింది.. ఈ సందర్భంగా కాజోల్‌ ఓ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది.. ధనుష్‌, అతని మరదలు విఐపి2 దర్శకురాలు సౌందర్యపై తమాషాగా మాట్లాడిన తీరు అక్కడున్న అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాయి.. ధనుష్‌, సౌందర్య విఐపి2లో తనపాత్రకు తమిళంలో డైలాగులు చెప్పాల్సిన అవసరం పెద్దగా ఉండదని చెప్పి తననా పాత్రకు ఒప్పించారని, కానీ తర్వాత చూస్తే బారెడు తమిళ డైలాగులు చెప్పించారని చెప్పింది..

తనకు హిందీ తప్ప వేరే భాష ఏమీ మాట్లాడటం రాదని, అయితే ధనుష్‌, సౌందర్య తనకు విఐపి2 గురించిచెప్పినపుడు అబద్ధం చెప్పారంటే చమత్కరించింది.. షూటింగ్‌ సంగతులు ఇంకా చెబుతూ.. రెండుసీన్లకు సంబంధించి తనకు స్క్రిప్టు పేపర్‌ ఇచ్చారని.. అందులో పెద్ద పెద్ద తమిళ డైలాగులుండటం చూసి కంగు తినటం తనవంతైందని చెప్పింది.. ఆ డైలాగులు చూడగానే తనకు భయమేసిందని, అయితే ఆ డైలాగుల్ని ఎలాగొలా చెప్పే ప్రయత్నం చేయండంటూ సింపుల్‌గా చెప్పేశారని కాజోల్‌ వివరించింది.. ఇది మోసం అని.. అయితే ఎలాగొలా తనతో తమిళ డైలాగులు చెప్పింంచిన ఘనత మాత్రం ధనుస్‌, సౌందర్యలదే అని కాజోల్‌ చెప్పింది… 90ల్లో తమిళంలో మిన్సార కనవు (మెరుపుకలలు) సినిమాచేసిన కాజోల్‌.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆ భాషలో విఐపి-2 చేసింది.. ఈచిత్రం అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్నసంగతి విదితమే.