ఆ ఇద్ద‌రి చారిత్రాత్మ‌క భేటీ

TRUMP, KIM MEETING
TRUMP, KIM MEETING

సింగ‌పూర్ః సెంటోసా దీవిలో చరిత్రాత్మక భేటీ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ కలుసుకున్నారు. క్యాపెల్లా హోటల్‌లో ఇద్దరూ భేటీ అయ్యారు. హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వన్ టు వన్ మీటింగ్ నిర్వహించారు. రెండు దేశాల జాతీయ పతకాల ముందు ఇద్దరూ హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. అంతర్జాతీయ మీడియా ముందు ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. వన్ టు వన్ మీటింగ్ తర్వాత.. ద్వైపాక్షిక చర్చలు కూడా ఉంటాయి. ఆ తర్వాత వర్కింగ్ లంచ్‌లో పాల్గొంటారు. సింగపూర్‌లోని ఆర్చడ్ ఏరియాలో బస చేసిన ఇద్దరు నేతలు ఇవాళ స్థానిక కాలమానం ఉదయం 8 గంటల తర్వాత సెంటోసా దీవిలోని క్యాపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి మీటింగ్ జరుగుతున్న హోటల్ వరకు సింగపూర్ ప్రజలు భారీగా బారులు తీరి ఆ నేతలకు స్వాగ‌తం చెప్పారు. ట్రంప్ షాంగ్రి లా హోటల్‌లో ఉన్నారు. కిమ్ సెయింట్ రిగీస్ హోటల్‌లో బస చేశారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి, కిమ్ యో జాంగ్, నమ్మకస్తుడు కిమ్ చాంగ్ సన్ కూడా సమావేశానికి హాజరయ్యారు. చరిత్రాత్మక భేటీకి సంబంధించిన అన్ని అంశాలు చురుగ్గానే సాగుతున్నాయని ట్రంప్ ట్వీట్ చేశారు.