ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌‌కి అరుదైన గౌరవం

STEVE SMITH
STEVE SMITH

ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే కెప్టెన్ స్టీవ్ స్మిత్‌‌కి అరుదైన గౌరవం దక్కింది. యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న స్మిత్‌ ‘ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌’గా నిలిచాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ వేడుకలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఇచ్చి ప్రతిష్టాత్మక ‘అలెన్ బార్డర్’ మెడల్‌ను స్మిత్ రెండోసారి అందుకున్నాడు. స్మిత్‌తో పాటు ‘ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ క్రీడాకారణి ఎలీస్ పెర్రీ రెండోసారి ‘బెలిండా క్లార్క్’ అవార్డును సొంతం చేసుకుంది. వీరితో పాటు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌’గా, ఆరోన్ ఫించ్ ‘టీ-20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌’గా నిలిచారు.