ఆస్ట్రేలియా ఓపెన్‌ ఉమెన్‌ విజేత ఒసాకా

naomi osaka
naomi osaka

మెల్‌బోర్న్‌: జపాన్‌ యువ కెరటం నవోమి ఒసాకా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో రెండుసార్లు వింబుల్డన్‌ విజేత, చెక్‌ రిపబ్లిక్‌ తార పెట్రా క్విటోవాతో జరిగిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ప్రపంచ నెం.1 గా నిలిచిన తొలి జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణిగా నవోమి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ తొలి సెట్‌లో ఒసాకా..పెట్రాపై 7-6తేడాతో గెలిచింది. తర్వాతి సెట్‌లో పెట్రా 5-7 తేడాతో నవోమిని మట్టికరిపించింది. తర్వాత 6-4 తేడాతో గెలిచి..ఆస్ట్రేలియా ఓపెన్‌ విజేతగా నిలిచింది. తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.