ఆస్కార్‌.. అభాసుపాలు

ఆస్కార్‌.. అభాసుపాలు

ఉత్తమ చిత్రంగా లాలా లాండ్‌.. తప్పుతప్పు..మూన్‌లైట్‌..

లాస్‌ ఏంజిల్స్‌: ఆస్కార్‌ అవార్డు పురస్కారం కార్యక్రమం అభాసుపాలైంది.. 89 ఏళ్ల ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం చరిత్రలో అతిపెద్ద తప్పుజరిగింది. లాస్‌ఏంజిల్స్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ తప్పు చోటుచేసుకుంది.. ఉత్తమ చిత్రం ఎంపికలో వేదికపై హైడ్రామా సాగింది.. చివరల్లో బెస్ట్‌ పిక్చర్‌ అవార్డును వారెన్‌ బీటి ప్రకటించారు.. అయితే ఆయన తొలుత లాలా లాండ్‌ చిత్రాన్ని ఉత్తమచిత్రంగా ప్రకటించారు. ఈ అవార్డును అందుకోవటానికి ఆ చిత్రం బృందం వేదికపై వచ్చింది.. అంతా సంబరాల్లో మునిగిపోయారు.. అదే తరుణంలో వేదికపైకి చ్చిన హోస్ట్‌ జిమ్మల్‌ ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు.. లాలా లాండ్‌ కాదు.. మూన్‌లైట్‌.. అంటూ ప్రకటించారు.. దీంతో ఆ ఫిల్మ్‌స్టార్లంతా సందడి చేశారు.. మూన్‌ లైట్‌ షాక్‌తో యావ్‌ సినీప్రపంచం విస్మయానికి గురైంది.. వారెన్‌ బిటీ తప్పుడు ప్రకటన చేయటంతో వేదికపై ఆస్కార్‌ బృందానికి చెందిన ఇద్దరు ఆ వేడుకను అడ్డుకున్నారు కూడ..